శుభ అహంకారములు
ఇప్పటివరకు మనం అజ్ఞానం, భ్రమలు, అవస్థలు గురించి తెలుసుకొని, వాటి నుండి బయట పడటానికి, మననిజమార్గంలో ప్రయాణించడానికి తోడ్పడే మార్గదర్శిఅయిన సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాము. ఆ సద్గురువును చేరే ముందు మనలని మనం ఎలాసన్నద్ధంచేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడుమనకు అవుసరమయ్యే సద్గుణాల గురించి తెలుసుకుందాము. వాటిలో మొదటివి "శుభ అహంకారములు"(Positive Ego). వీటి గురించి పెద్దలు ఏమి చెప్పారో తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:
నేను మరియు ఈ సర్వవిశ్వము అచ్యుతుడగు పరమాత్మయే! చైతన్యరూపుడనగు నాకంటే అన్యమైనది మరేమియు లేదు. అనునిట్టి అహంకార సంకల్పము సర్వోత్తమమైనట్టిది. నేనీజగత్తుకంటే వేరుగా నున్నాను. నేను వాలాగ్రము (కేశాగ్రము) కంటే అత్యంత సూక్ష్మమైన వాడను. ఈవిధమగు జ్ఞాన సంకల్పముతో నుండునది రెండవఅహంకారము. ఈఅహంకారము కూడ శుభమైనదే. ఈరీతిగా నున్న రెండు అహంకారములును మోక్షమును ప్రసాదించును ఈ అహంకారములు జీవన్ముక్తులకుండును. (ఇందులోమొదటిది నాలుగు మహావాక్యాలైన "అహం బ్రహ్మస్మి", తత్వమసి", "అయమాత్మా బ్రహ్మ", "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే వాటియొక్క సారము. ఈ రకమైన అహంకారభావన (ఆంటే ఈవాక్యాల ద్వారా ఏదైతే ప్రతిపాదింపబడిందో అదే నేను అనే భావన) సర్వోత్తమమైనది. ఇది నిశ్చయముగా పరబ్రహ్మ వైపుకు తీసుకు వెడుతుంది. ఇక రెండవది మన ఆత్మ గురించి మనం తెలుసుకునే స్వస్వరూప జ్ఞానం. దీని గురించి సరియైన వివరణ మనంరోజూ చదువుకునే "మంత్ర పుష్పం"లోవుంది. దాన్ని చూద్దాం. "అనంత మవ్యయం కవిగ్ మ్, సముద్రేంతంవిశ్వశంభువం, పద్మకోశప్రతీకాశాగ్ మ్, హృదయం చాప్యధోముఖం|| అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాముపరితిష్ఠతి, జ్వాలమాలాకులంభాతీ విశ్వస్యా యతనంమహత్|| సంతతగ్ మ్ శిలాభిస్తులంబత్యాకోశసన్నిభం, తస్యాంతేసుషిరగ్ మ్ సూక్ష్మం తస్మిన్ సర్వంప్రతిష్ఠితం|| తస్యమధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః, సోగ్రభుగ్విజన్ తిష్ఠన్నాహారమజరః కవిః|| తిర్యగూర్ధ్వమధశ్శాయీరశ్మయస్త్ యస్య
సంతతా, సంతాపయతి స్వం దేహమాపాద తలమస్తకః, తస్యమధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా
వ్యవస్థితః|| నీలతోయద మధ్యస్తా ద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ
పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః, సబ్రహ్మ సశివః
సహరిః స్స్యేంద్రః సోక్షరః పరమఃస్వరాట్||" అనంతమైన వాడు, అవ్యయుడు,
సర్వజ్ఞుడు, సంసారసాగర అంతాన యుండేవాడు, యావత్ప్రపంచానికి మంగళకరుడు అయిన
పరమాత్మ అధోముఖమైన తామరమోగ్గలా, కంఠంక్రింద నాభికి జానెడు దూరంలో వున్న
హృదయంలో, దీపశిఖల వరుసతో ఆవృత్త మైనట్లు ప్రకాశిస్తూ విశ్వానికంతటికి
ఆవాసమైవున్నది. ఆతామరమొగ్గలాంటి హృదయం నలువైపులానాడులతోచుట్టబడివ్రేలాడుతూ వున్నది. దానిలోపల వున్న సూక్ష్మమైన ఆకాశంలో అంతా
నెలకొనివున్నది. దానిమధ్యలో సర్వత్రా ప్రకాశిస్తూ, అన్నిదిశాలా
వ్యాపిస్తున్నట్లు వుండే అగ్ని వున్నది. అది మొదట భుజించే ఆహారాని విభజించి
ధృఢమైనదిగా చేస్తోంది. దానియొక్కకిరణాలు అడ్డదిడ్డంగాను, ఉర్ధ్వంగాను,
అధోముఖంగాను, అంతా వ్యాపించి పాదంనుండి తలవరకూ తన శరీరాన్ని వెచ్చగావుండేటట్లు చేస్తుంది. దానిమధ్య అణుప్రమాణమైన అగ్నిజ్వాల ఊర్ధ్వముఖంగా
అమరివుంది. అది నీల మేఘంమధ్యనుండి ప్రకాశించే మెరపుతీగవలె వరిగింజకొసలాసన్నమైనదిగా, బంగారురంగులో అణువులా సూక్ష్మమైనదిగా ప్రకాశిస్తూ వుంటుంది. ఆ
అగ్నిశిఖ మధ్యలో పరమాత్మ నెలకొని వున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు,
శివుడు, హరి, ఇంద్రుడు, అక్షరస్వరూపుడు, స్వప్రకాశ మానుడు. ఆయనకంటే
పరమైనవారు ఎవరూలేరు. ఇక్కడ చెప్పబడిన హృదయం మన భౌతిక శరీరంలోవున్న గుండె
కాదు. అది మనకున్న వేరే శరీరానికి సంబంధించినది. దీనిగురించి వేరే అంశంలో
ప్రస్తావించడం జరిగింది. దయచేసే చూడగలరు. ఆ హృదయంలో వరిధాన్యం కన్న
సూక్ష్మంగా వున్నదానినే, ఇక్కడ కేశాగ్రం కంటే సూక్ష్మంగా ఉన్నదని వర్ణించడం
జరిగింది. ఈ రెండూ ఒక్కటే. వేరు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ సుక్ష్మమైనదే
నేను అనే భావన మనలను ఆ పరమాత్మవైపు పంపిస్తుందా? లేదా? కాబట్టి ఇదికూడా శుభ
అహంకారమే. తప్పనిసరిగా కావలసినదే.)
హస్తాదులతో కూడిన శరీరము నేను అనెడి నిశ్చయముగల అహంకారము మూడవది. ఇది లౌకిక మైనది, తుచ్ఛమైనది యగును. ఈ లౌకికాహంకారముతో అభిహతుడైన జీవుడు అధోగతికి పోవుచున్నాడు. బహుకాలము ఈశరీరమే నేననుసంకల్పముతో కూడియున్న ఈ దురహంకారమును చక్కగా విడచిపెట్టి, శేషించిన పరిశుద్ధాహంకారముతో నున్న జీవుడు శాంతుడై ముక్తిని పొందును. అలౌకికములైన మొదటి రెండు అహంకారములను అంగీకరించి మూడవదైన దుఖఃప్రదాయినియగు లౌకికఅహంకారమును త్యజించవలెను. పిమ్మట మొదటి రెండు అహంకారములను కూడ విడచిపెట్టి, సర్వాహంకృతి వర్జితుడై జ్ఞాని, సర్వోత్తమమగు మోక్ష పదము నధిరోహించుచున్నాడు. భోగేచ్ఛయే బంధమగును. భోగమును విడచిపెట్టుటయే మోక్షమని చెప్పబడును. మనస్సు అభివృద్ధిని పొందుటయే అపకారము. మనోనాశనమే మహా లాభము. జ్ఞానికి మనస్సు నశించును. అజ్ఞానికి మనస్సు శృంఖల యగుచున్నది. జ్ఞాని యొక్క మనస్సు సానందము కాదు. నిరానందము కాదు. చలనము, ఆచలనము కాదు. సత్తు, అసత్తు కాదు. సర్వవికల్పముల మధ్యలో నుండు స్థిరత్వమే జ్ఞానియొక్క మనస్సు. ఆకాశము సూక్ష్మమై యున్నందున కన్పించుటలేదు. సర్వసంకల్ప రహితమైన, సర్వసంజ్ఞా వివర్జితమైన, అవినాశియుడైన, స్వస్వరుపమగు ఈ చిత్ వస్తువును 'ఆత్మజుడు' మున్నగు పేర్లతో చెప్పుచున్నారు. బ్రహ్మజ్ఞానుల దృష్టిలో ఈ ఆత్మ ఆకాశములో నూరవ భాగమంతటి సూక్ష్మముగను, శుద్ధముగాను, నిష్కలముగాను, నిజస్వరుపముగాను, ఏకముగను, అనుభవము నిచ్చుచున్నది.
యోగవాసిష్ఠము:స్థితి ప్రకరణము:33వ సర్గ:
49-54: ఓ రామా! ఈ జగంబున మూడు విధములైన అహంకారములు కలవు. వానిలో మొదటి రెండునూ శ్రేష్టములు. మూడవది శ్రేష్టము కాదు. య్యది త్యజింపదగినది. వానిని గూర్చి వచింపుచున్నాను.
"ఈ జగత్తంతయూ కార్యరూపము. కారణరూపుడును, నాశరహితుడునునగు పరమాత్మనునేనే. నాకన్యముగా జగత్తేలేదు." అను నీఅహంకారము సర్వోత్తమమని యెరుంగ వలయును. ఈ యహంకారము మోక్షమునే గలుగజేయును కాని బంధము కాదు. ఇయ్యది జీవన్ముక్తునకుండును. "నేనన్నింటి కంటెనూ భిన్నమై (సాక్షి స్వరూపుడనై) కేశాగ్ర భాగము యొక్క నూరవభాగము కంటెనూ సూక్ష్మమై యున్నాను. అనగా నిరవయవుండను". ఇట్టి మనోనిశ్చయమున్ను శుభాహంకృతియే యగును. ఈ రెండవయహంకారమున్ను మోక్షము నే కలుగజేయునుగాని బంధమునుగాదు. ఇయ్యది జీవన్ముక్తున కుండును. (జ్ఞానములో) సప్తమభుమికయందుండు వారలకీ రెండుఅహంకారములును కేవలము కల్పనామాత్రములే కాని వాస్తవములు కావు (జ్ఞానములో గల వివిధభూమికల గురించి వేరే చెప్పుకుందాము). ఇక "హస్తపాదాదియుక్తమగు దేహము మాత్రమే నేనను" నిశ్చయము లౌకికముగా తుచ్ఛమును నగు మూడవ అహంకారమనబాడును. ఇది నీచమైనది. మరియు ఇయ్యది ప్రబల శత్రువని వచింపబడినది. గాన త్యజింపదగును.
58. మొదటి రెండహంకారములును, మూడవదియగు దేహాహంకారమువలె ధృఢ పరచుకొని , నేను దేహమునుకానని నిశ్చయిం చిన మీదట ఆ యహంకారములను కూడ త్యజించి వేయుట పూర్వీకులగు మహాత్ముల సమ్మతము.
62. దుఃఖప్రదమగు ఈ మూడవ అహంకారమును త్యజించి, సర్వాహంభావ, శుద్ధా హంభావ, గురుశుశ్రూషాదులచే సప్తభూమికాదులయందు యేవిధమైన స్థితికలిగియుండుటకు సమర్థుడగునో ఆయారీతిగనే స్వరూప సుఖాది లాభమొందుచూ జీవుడు క్రమముగా పరబ్రహ్మమును ప్రాప్తినొందును.
71. ప్రథమమున ఈ జగత్తంతయూ నేనే కాన అంతయూ నాస్వరూపమే యగునని నిశ్చయించి పిదప ఈ దేహాదులు నేను కాను, దేహ సంబం ధములగు ధనపుత్రాదులు నావి గావని భావించి, ప్రతిబంధములన్నియు రహితములగుటచే, పూర్వొక్తమగు పరిశుద్ధాత్మ చైతన్యమును బొంది క్రమముగా సప్తమ భూమిక యందు స్థితి కలిగి, స్వయముగా అపరిచ్ఛిన్నమగు పరిపుర్ణాత్మ స్వరుఉపుడై జీవుడు విదేహకైవల్యము ప్రాప్తినొందును.
(Please visit www.tatvavisleshana.weebly.com)
ఇప్పటివరకు మనం అజ్ఞానం, భ్రమలు, అవస్థలు గురించి తెలుసుకొని, వాటి నుండి బయట పడటానికి, మననిజమార్గంలో ప్రయాణించడానికి తోడ్పడే మార్గదర్శిఅయిన సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాము. ఆ సద్గురువును చేరే ముందు మనలని మనం ఎలాసన్నద్ధంచేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడుమనకు అవుసరమయ్యే సద్గుణాల గురించి తెలుసుకుందాము. వాటిలో మొదటివి "శుభ అహంకారములు"(Positive Ego). వీటి గురించి పెద్దలు ఏమి చెప్పారో తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:
నేను మరియు ఈ సర్వవిశ్వము అచ్యుతుడగు పరమాత్మయే! చైతన్యరూపుడనగు నాకంటే అన్యమైనది మరేమియు లేదు. అనునిట్టి అహంకార సంకల్పము సర్వోత్తమమైనట్టిది. నేనీజగత్తుకంటే వేరుగా నున్నాను. నేను వాలాగ్రము (కేశాగ్రము) కంటే అత్యంత సూక్ష్మమైన వాడను. ఈవిధమగు జ్ఞాన సంకల్పముతో నుండునది రెండవఅహంకారము. ఈఅహంకారము కూడ శుభమైనదే. ఈరీతిగా నున్న రెండు అహంకారములును మోక్షమును ప్రసాదించును ఈ అహంకారములు జీవన్ముక్తులకుండును. (ఇందులోమొదటిది నాలుగు మహావాక్యాలైన "అహం బ్రహ్మస్మి", తత్వమసి", "అయమాత్మా బ్రహ్మ", "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే వాటియొక్క సారము. ఈ రకమైన అహంకారభావన (ఆంటే ఈవాక్యాల ద్వారా ఏదైతే ప్రతిపాదింపబడిందో అదే నేను అనే భావన) సర్వోత్తమమైనది. ఇది నిశ్చయముగా పరబ్రహ్మ వైపుకు తీసుకు వెడుతుంది. ఇక రెండవది మన ఆత్మ గురించి మనం తెలుసుకునే స్వస్వరూప జ్ఞానం. దీని గురించి సరియైన వివరణ మనంరోజూ చదువుకునే "మంత్ర పుష్పం"లోవుంది. దాన్ని చూద్దాం. "అనంత మవ్యయం కవిగ్ మ్, సముద్రేంతంవిశ్వశంభువం, పద్మకోశప్రతీకాశాగ్ మ్, హృదయం చాప్యధోముఖం|| అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాముపరితిష్ఠతి, జ్వాలమాలాకులంభాతీ విశ్వస్యా యతనంమహత్|| సంతతగ్ మ్ శిలాభిస్తులంబత్యాకోశసన్నిభం, తస్యాంతేసుషిరగ్ మ్ సూక్ష్మం తస్మిన్ సర్వంప్రతిష్ఠితం|| తస్యమధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో